సాధారణంగా కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.మనలో కూడా నాన్ వెజ్(మాంసాహారం) ప్రియులు చాలా మంది ఉంటారు.
అయితే వారానికి ఒకటి, రెండుసార్లు నాన్ వెజ్( Non-Veg ) తినేవారు కొందరైతే.రెగ్యులర్‌గా తినేవారు మరికొందరు.
అలాగే అస్సలు తిననివారు కూడా ఉన్నారు.వీరి గురించి పక్కన పెట్టిస్తే.
అసలు నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.? రెగ్యులర్ గా తింటే ఏం అవుతుంది? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం ప్రోటీన్ కు( Protein ) మంచి మూలం.రక్తహీనతను తగ్గించే ఐరన్ మరియు జింక్ వంటి మినరల్స్ ను మీట్ ద్వారా పొందొచ్చు.గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ను చేపల్లో పుష్కలంగా ఉంటాయి.ఎముకలను బలోపేతం చేసే న్యూట్రియెంట్స్ చికెన్ లో ఉంటాయి.
హెల్త్ పరంగా మాంసాహారం( Meat ) పలు ప్రయోజనాలు అందించినప్పటికీ.రెగ్యులర్ గా తినకపోవడమే మంచిదంటున్నారు.
వారానికి 2-3 సార్లు మితంగా తినడం చాలా ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
రెగ్యులర్ గా నాన్ వెజ్ తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.దీని వల్ల గుండె జబ్బులు( Heart Diseases ) వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.అలాగే మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
రెగ్యులర్ గా మాంసాహారం తింటే మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
మాంసాహారం నిత్యం తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి.ఫలితంగా ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటి జబ్బలును ఫేస్ చేయాల్సి ఉంటుంది.రోజూ మాంసాహారం తీసుకోవడం వల్ల శాకాహారంలో ఉండే ఫైబర్ తక్కువగా పొందే అవకాశం ఉంది.
ఫైబర్ లోపం అనేక సమస్యలకు దారితీస్తుంది.అంతేకాకుండా రెగ్యులర్ గా నాన్ వెజ్ తీసుకుంటే అందులోని అధిక ప్రోటీన్ కిడ్నీలపై ఒత్తిడి పెంచి వాటి పనితీరును దెబ్బతీస్తుంది.
మాంసాహారం ప్రోటీన్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తే.శాకాహారం ఫైబర్, విటమిన్లు, మరియు ఖనిజాలను అందిస్తుంది.అందుకే ఈ రెండింటి మధ్య సమతుల్యత చాలా అవసరం.కాబట్టి రెగ్యులర్ గా మాంసాహారం కాకుండా, కూరగాయలు, పప్పులు, పండ్లు మరియు గింజలు కూడా డైట్ లో చేర్చుకోండి.