హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే కాఫీ పౌడర్.. ఇలా వాడితే మ‌స్తు బెనిఫిట్స్!

హెయిర్ ఫాల్.ప్రస్తుత చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.

 How To Use Coffee Powder For Control Hair Fall! Coffee Powder, Control Hair Fall-TeluguStop.com

వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు ప్రధాన కారణం.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ కి అడ్డుకట్ట వేయడం కోసం తెలిసిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.

తోచిన ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా సరే జుట్టు రాలడం అదుపులోకి రాకుంటే తెగ హైరానా ప‌డిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు టెన్షన్ పడకండి.ఎందుకంటే అందరి ఇళ్లలో ఉండే కాఫీ పౌడర్ తో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయవచ్చు.

అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అలాగే ఆముదం కొబ్బరి నూనె మరియు అలోవెరా జెల్ లో ఉండే సుగుణాలు కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ గ్రోత్ డబుల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.మరియు జుట్టు షైనీగా సిల్కీగా సైతం మెరుస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో సతమతం అయ్యేవారు తప్పకుండా కాఫీ పౌడర్ ను పైన చెప్పిన విధంగా ఉపయోగించండి.

జుట్టు రాలడాన్ని అరికట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube