ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ సామ్రాజ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ లు తీసుకొస్తున్న చట్టాలు సంచలనంగా మారుతున్నాయి.
ఈ చట్టాలు అతి భయంకరం కావడంతో… చాలామంది దేశం విడిచి పారిపోయారు.ఇదిలా ఉంటే ఆడవాళ్ళపై కఠిన ఆంక్షలు విధిస్తూ చదువుకు దూరం చేయటంతో పాటు ఉద్యోగం కూడా చేయకూడదని తాలిబాన్ లు వ్యవహరిస్తున్న తీరుపై ఓ ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు.
కాబుల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో తన డిగ్రీ పట్టా సర్టిఫికెట్ చింపేశారు.“నాకు డిగ్రీలు అవసరం లేదు.నా తల్లులు, సోదరీమణులు చదవలేకపోతే… ఈ విద్యను నేను అంగీకరించను.అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే రీతిలో ఆడవాళ్లపై తాలిబాన్ లు కఠిన చట్టాలు తీసుకొచ్చారు.అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్యం పరంగా ప్రభుత్వం ఏర్పడటంతో… ఆడవాళ్లు యధావిధిగా ఉన్నత చదువులు చదువుతూ మరోపక్క ఉద్యోగం చేసుకోవడం జరిగింది.
కానీ ఇప్పుడు మళ్లీ తాలిబాన్ లు దేశాన్ని పరిపాలిస్తూ ఉండటంతో ఆడవాళ్ళపై విధిస్తున్న ఆంక్షలు సంచలనంగా మారాయి.