ఈ 3 పదార్థాలతో మెడ నలుపును ఈజీగా వదిలించుకోవచ్చు.. తెలుసా?

సాధారణంగా కొందరి మెడ ముఖ చర్మం కంటే నల్లగా ఉంటుంది.ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్య అధికంగా వేధిస్తుంటుంది.

 Get Rid Of Black Neck Easily With These 3 Ingredients, Rice Flour, Honey, Orange-TeluguStop.com

అలాగే మృత కణాలు పేరుకుపోవడం, ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల కూడా మెడ నల్లగా మారుతుంటుంది.దీంతో అక్కడి చర్మం కాస్త అసహ్యంగా మరియు అందవిహీనంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు కలవరపడకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలతో ఈజీగా మెడ నలుపును వదిలించుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ మూడు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా చర్మంపై ఉపయోగించాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఆరెంజ్ పండు తీసుకుని సగానికి కట్ చేసి అందులో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా ఏదైనా బ్ర‌ష్‌ సహాయంతో అప్లై చేసుకోవాలి.కనీసం ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకొని అనంతరం తడి వేళ్ళతో మెల్లగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.

ఆపై ఏదైనా మంచి మాయిశ్చరైజ‌ర్ ను మెడకు అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే బియ్యం పిండి, తేనె, ఆరెంజ్ జ్యూస్ లో ఉండే ప్రత్యేక గుణాలు మెడ నలుపును సులభంగా మరియు వేగంగా పోగొడుతాయి.మెడ వద్ద చర్మాన్ని తెల్లగా మృదువుగా మారుస్తాయి.మృత కణాలు ఏమైనా ఉంటే తొలగించి మెడను అందంగా మారుస్తాయి.కాబట్టి ఎవరైతే మెడ నలుపు తో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube