'వారిసు' సాంగ్.సరికొత్త రికార్డ్.. ఆనందంలో మేకర్స్.. పోస్ట్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ప్రెజెంట్ విజయ్ చేస్తున్న సినిమా ‘వారిసు’.

 Soul Of Varisu Song Stands In Famous Music Charts , Soul Of Varisu Song, Rashmik-TeluguStop.com

ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటి వరకు అయితే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకోగా తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే బజ్ వచ్చింది.

అందులోను సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం అదే సంక్రాంతికి మన తెలుగు హీరోలు చిరు, బాలయ్య తమ సినిమాలతో బరిలోకి దిగుతుండడం వల్ల ఈ సినిమాకు మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.

అలాగే సాంగ్స్ విషయంలో అయితే ఫ్యాన్స్ నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.ఇక తాజాగా ఈ సాంగ్ నుండి వచ్చిన సౌల్ సాంగ్ మరింత రెస్పాన్స్ అందుకుంటుంది.

ఈ పాటను కె ఎస్ చిత్ర గారు ఆలపించారు.అయితే తాజాగా ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ట్విట్టర్ ఫేమస్ ఛార్ట్స్ బిల్ బోర్డులో ఎన్నో ఇంటర్నేషనల్ సాంగ్స్ ను దాటి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

ఇది మాత్రం మాములు విషయం కాదు అనే చెప్పాలి.ఈ విషయం తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతం అందిస్తూ మరింత ప్లస్ అయ్యేలా చేస్తున్నాడు.

ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube