అల‌ర్జీ వ‌ల్ల గుడ్డును దూరం పెడుతున్నారా? అయితే ఇవి మీకోస‌మే!

సంపూర్ణ పోష‌కాహారం అయిన గుడ్డు పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రికీ ఎంతో మేలు చేస్తుంది.అందుకే ప్ర‌తి రోజూ ఒక ఉడికించిన గుడ్డును తినాల‌ని నిపుణులు చెబుతుంటారు.

 Best Alternative Foods To Egg Details! Alternative Foods To Egg, Alternative Foo-TeluguStop.com

అయితే కొంద‌రికి గుడ్డు తిన‌డం వ‌ల్ల అల‌ర్జీ వ‌స్తుంటుంది.అలాంటి వారు గుడ్డును దూరం పెడుతుంటారు.

ఫ‌లితంగా అందులో ఉండే పోష‌కాల‌న్నిటినీ చేజార్చుకుంటుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఎందుకంటే, గుడ్డులో ఉండే పోష‌కాల‌ను వేరే ఆహారాల ద్వారా కూడా భ‌ర్తీ చేయ‌వ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

బ్రోకలీ. అద్భుత‌మైన గ్రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక‌టి.

ఎవ‌రైతే అల‌ర్జీ వ‌ల్ల గుడ్డును దూరం పెడ‌తారో వారు త‌ప్ప‌కుండా బ్రోక‌లీని తీసుకోవాలి.గుడ్డులో ఉండే ప్రోటీన్‌, కాల్షియం, ఐర‌న్‌, విట‌మిన్స్ బ్రోక‌లీలోనూ నిండి ఉంటాయి.

బ్రోక‌లీని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.అలాగే గుడ్డును ఎవైడ్ చేసే వారు త‌మ డైట్‌లో సోయా బీన్స్‌ను చేర్చుకోవాలి.

ఎందుకంటే, ఇవి గుడ్డుకు గొప్ప ప్రత్యామ్నాయం.గుడ్డును తినని వారు దాని బ‌దులుగా సోయా బీన్స్‌ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Telugu Benefits Egg, Broccoli, Groundnuts, Tips, Latest, Soya Beans-Telugu Healt

వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి చేర‌కుండా అడ్డుకోవ‌చ్చు.అలాగే సోయా బీన్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు, ఎముక‌లు దృఢంగా మార‌తాయి మ‌రియు మ‌ధుమేహం, ర‌క్త‌హీన‌త వంటి వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

గుడ్డు తిన‌ని వారికి వేరుశెన‌గ మంచి ఎంపిక.త‌ర‌చూ వేరుశెన‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన విటమిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ల‌భిస్తాయి.కాబ‌ట్టి, గుడ్డులోని పోష‌కాల‌ను మ‌రియు దాని ప్ర‌యోజ‌నాల‌ను భ‌ర్తీ చేయాల‌నుకుంటే ఖ‌చ్చితంగా వేరుశెన‌గ‌ల‌ను తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube