మనలో ప్రతి ఒక్కరూ కూడా అందమైన, కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు.అలా కోరుకోవడం సహజమే.
దీనికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును కూడా ఖర్చు పెడుతూ ఉంటారు చాలామంది.దీనికోసం ఎన్నో వేల డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కాస్త కొబ్బరి నూనె వేసి బాగా కలిపి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత దాన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి.ఒక అరగంట తర్వాత ఆరాక ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోతుంది.దీంతో కాంతివంతంగా మారుతుంది.నల్లని మచ్చలు అన్నీ కూడా తొలగిపోతాయి.కాస్త శ్రద్ధ పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని కాంతివంతం చేసుకోవచ్చు.ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మొటిమలను దూరం చేస్తుంది.
ఎందుకంటే మొటిమల కారణం అయ్యే ఇన్ఫెక్షన్లతో చనగపిండి పోరాడుతుంది.చర్మం మీద ఉన్న నలుపును కూడా తగ్గిస్తుంది.
దీంతో చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయపడుతుంది.అంతేకాకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

రాగి పిండి వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది.అలాగే చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.ఇక ఎప్పుడూ మీరు యవ్వనంగా కనిపిస్తారు.
పంచదారలో ఉన్న లక్షణాలు చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మారేలా చేస్తుంది.అలాగే కొబ్బరి నూనె చర్మం మీద తేమ ఉండేలా చూస్తుంది.
దీంతో మీ ముఖంపై మొటిమలు రాకుండా ఎప్పుడూ నీటిగా, కాంతివంతంగా కనిపిస్తుంది.చాలామంది వేలకు, వేలు ఖర్చులు పెట్టే కన్నా ఈ ఇంటి చిట్కాను ప్రయత్నించి చూస్తే ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి.