సాధారణంగా అమ్మాయిలు అందరూ పింక్ అండ్ గ్లోయింగ్ లిప్స్( Pink and glowing lips ) ను పొందాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.అటువంటి పెదవుల కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ టిప్స్ తో సులభంగా మరియు సహజంగా పింక్ అండ్ గ్లోయింగ్ లిప్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
రెమెడీ 1: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ వాసెలిన్( Vaseline ) వేసుకోవాలి.అలాగే రెండు టీ స్పూన్లు షుగర్ పౌడర్,( sugar powder ) వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ ( Beet root juice )మరియు వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసుకుని అరగంట పాటు వదిలేయాలి.అనంతరం పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ పెదాలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ను రిమూవ్ చేస్తుంది.
పెదాలను గులాబీ రంగులోకి మారుస్తుంది.సహజ మెరుపును పెదాలకు జోడిస్తుంది.

రెమెడీ 2: కొన్ని గులాబీ రేకులను ( Rose petals )పాలలో గంట పాటు నానబెట్టి, మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోండి.ఈ పేస్ట్‌ను లిప్స్‌పై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి.రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే లిప్స్‌కు సహజమైన గులాబీ రంగు లభిస్తుంది.పెదాల నలుపు వదిలిపోతుంది.

ఇక ఈ టిప్స్ ను ఫాలో అవ్వడంతో పాటు లిప్స్ ఆరోగ్యంగా, మృదువుగా, పింక్‌గా ఉండాలంటే ప్రత్యేక కేర్ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.లిప్స్‌ను హైడ్రేట్ గా ఉంచుకునేందుకు రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి.నైట్ నిద్రించే ముందు నెయ్యి లేదా ఆల్మండ్ ఆయిల్ ను పెదాలకు అప్లై చేయండి.హార్ష్ కెమికల్స్ ఉన్న లిప్‌స్టిక్స్‌కు బదులుగా హెర్బల్ అండ్ సన్ ప్రొటెక్షన్ లిప్‌బామ్స్ వాడండి.
విటమిన్ ఇ, సి, బి ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.ఇవి లిప్స్ ను ఆరోగ్యంగా ఉండచటంలో కీలక పాత్రను పోషిస్తాయి.