అతిగా తిని జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ఇలాంటి టీ లను తాగితే జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయా..

If You Drink These Teas All The Digestive Problems Go Away Details, Tea, Digestive Problems, Menthi Tea, Green Tea, Peppermint Teal, Herbal Tea, Stomach Ache, Unhealthy Food, Turmeric Tea

2022 సంవత్సరానికి ఇప్పుడు చివరి రోజులు అని చెప్పవచ్చు.ఇక ఈ సంవత్సరానికి చివరిగా రాబోయే పండుగ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అనీ అందరికీ తెలుసు.

 If You Drink These Teas All The Digestive Problems Go Away Details, Tea, Digesti-TeluguStop.com

పండగ సీజన్లు వస్తే మనమందరం ఏమీ ఆలోచించకుండా ఏది కావాలంటే అది తింటూ ఉంటాం.ప్రత్యేకించి కొన్ని పండుగల సమయాలలో ఇష్టమైన తీపి వంటకాలు, మాంసాహారం అని ప్రతిరోజు రకరకాల లో ఆహారాలను తిని చాలామంది ప్రజలు అజీర్తి సమస్యతో బాధపడుతూ ఉంటారు.

కాబట్టి ఈ సమస్య నుండి బయట పడాలంటే మన ఇంటి వంట గదిలో కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంది.

మనం రోజు తినే ఆహారం జీర్ణాశయంలో స్రవించే యాసిడ్ ద్వారా జీర్ణం అవుతూ ఉంటుంది.

కానీ అతిగా తింటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, విపరీతమైన గ్యాస్ మరియు నీరసంగా ఉంటుంది.కాలేయం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

మధుమోహo మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సహజ పద్ధతులను పండించడం మంచిది.

మెంతి టీ, గ్రీన్ టీ మరియు పిప్పరమెంటు టీ వంటి హెర్బల్ టీలు ఆహారం జీర్ణ వ్యవస్థ ద్వారా సులభంగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అతిగా తినడం వల్ల కలిగే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.పసుపులో ఉండే కారుకుమిన్ అనే పదార్థం జీవక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం చిటికెడు పసుపు పొడి కలిపి భోజనం తర్వాత తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే అతిగా తిని కడుపులో యాసిడ్ తో బాధపడేటప్పుడు సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి వేడివేడిగా తాగడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Video : అతిగా తిని జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలాంటి టీ #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube