మొటిమలు( Acne ) బాగా వేధిస్తున్నాయా..? ఎంత ప్రయత్నించినా అవి మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.? మొటిమల కారణంగా ముఖం కాంతిహీనంగా కనిపిస్తుందా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.ఈ రెమెడీతో మొటిమలన్నిటినీ దూరం చేసుకోవచ్చు.
ముఖాన్ని అందంగా ఆకర్షణీయంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు టొమాటో ముక్కలు, మూడు శుభ్రంగా పొట్టు తొలగించిన వెల్లుల్లి( Garlic ) రెబ్బలు వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ ప్యూరీలో రెండు స్పూన్లు అవిసె గింజల జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని ప్రయత్నిస్తే ముఖంపై ఎలాంటి మొండి మొటిమలు ఉన్నా సరే పరార్ అవుతాయి.వాటి తాలూకు మచ్చలు ఉంటే మాయం అవుతాయి.
ముఖం అందంగా మారుతుంది.ఆకర్షణీయంగా మెరుస్తుంది.
మొటిమల సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.తరచూ ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు రావడం కూడా క్రమంగా తగ్గుతాయి.
కాబట్టి మొటిమల్లేని అందమైన మెరిసే చర్మం కోసం తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.







