ఒకప్పుడు టీ త్రాగితే మంచిది కాదనే అభిప్రాయం ఉంది.అయితే టీ త్రాగటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
అయితే వ్యాయామం ముందు
లేదా వ్యాయామం తర్వాత ఇప్పుడు చెప్పే ఏ రకమైన టీని అయినా త్రాగవచ్చు.ఇప్పుడు వ్యాయామం చేసిన తర్వాత త్రాగే టీల గురించి తెలుసుకుందాం.
గ్రీన్ టీ
గ్రీన్ టీ మంచి హెర్బల్ టీ.బరువు తగ్గాలన్న,కొవ్వు కారాగాలన్న ఈ టీ చాలా
అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.వ్యాయామం తర్వాత ఈ టీని త్రాగితే
జీర్ణక్రియ మెరుగుపడి కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయి.
బ్లాక్ టీ
ఈ టీని వ్యాయామం తర్వాత త్రాగితే రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు.నైట్రిక్ యాసిడ్ లెవెల్ పెరిగి బలాన్ని పొంది వెయిట్ లిఫ్టింగ్ వంటివి
తేలికగా చేయగలరు.

హెర్బల్ టీ
వ్యాయామం తర్వాత హెర్బల్ టీ త్రాగితే శరీరంలో ఎనర్జీ స్ధాయిలు
పెరుగుతాయి.ఈ టీలో కేలరీలు తక్కువగా ఉండుట వలన స్ట్రెచింగ్ లేదా
కార్డియో వర్కవుట్లు చేసేవారికి చాలా మంచిది.వ్యాయామం చేసిన తర్వాత
త్రాగితే చురుకుదనం పెరుగుతుంది.
అల్లం టీ
వ్యాయామం తర్వాత అల్లం టీ తాగితే సహజమైన మెడిసిన్ లా పనిచేస్తుంది.కండరాల నొప్పులు తగ్గుతాయి.
జీర్ణక్రియ పెరుగుతుంది.కనుక కండల నొప్పులు తగ్గాలంటే జింజర్ టీ మంచిది.