చింతపండు గురించి పరిచయం అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వంటల్లో చింతపండును వాడుతుంటారు.
చింతపండు లేనిదే కొన్ని వంటలు అసంపూర్ణం.అయితే మీరు ఎప్పుడైనా చింతపండు టీ ను( Tamarind Tea ) తాగారా.? ఆశ్చర్యపోవద్దు మీరు విన్నది నిజమే.గ్రీన్ టీ, జింజర్ టీ, లెమన్ టీ ఇలా ఎన్నో రకాల టీలు తెలుసు.
కానీ చింతపండు టీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది.నిజానికి చింతపండు టీ హెల్త్ పరంగా చాలా మేలు చేస్తుంది.చింతపండు టీ యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే రోజు తాగేస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం చింతపండుతో టీ ఎలా తయారు చేసుకోవాలి.
దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు( Tamarind ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
గంట తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న చింతపండును వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్( Glass Water ) పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger ) వేసి ఐదు నిమిషాలు పాటు మరిగించాలి.
ఆపై అందులో రెండు స్పూన్లు బెల్లం పొడి,( Jaggery Powder ) రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పేస్ట్ వేసి మరో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసుకున్న టీ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ చింతపండు టీలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి సేవించాలి.చింతపండు టీ రుచి పరంగా చాలా బాగుంటుంది.
అలాగే ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది.చింతపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉంటాయి.
చింతపండుతో టీ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ( Digestive System ) ఉత్తేజంగా మారుతుంది.పేగు కదలికలు మెరుగుపడతాయి.
మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

అలాగే చింతపండు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.ఆరోగ్యకరమైన రక్తప్రసరణకు చింతపండు టీ ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.
అంతేకాకుండా మధుమేహం( Diabetes ) ఉన్నవారికి చింతపండు టీ ఒక వరం అని చెప్పుకోవచ్చు.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి చింతపండు టీ ఉపయోగపడుతుంది.
అంతేకాదు వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చింతపండు టీను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు.కాలేయ సంబంధిత వ్యాధులు సైతం తలెత్తకుండా ఉంటాయి.