అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధిపతిగా భారత సంతతికి చెందిన కాష్ పటేల్( Kash Patel ) బాధ్యతలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సంస్థలో మరో భారత మూలాలున్న మహిళకు స్థానం దక్కింది.
భారత సంతతికి చెందిన షోహిణి సిన్హాను( Shohini Sinha ) ఎఫ్‌బీఐలోని( FBI ) బాధితుల సేవల విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించింది.ఇటీవల సాల్ట్ లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్‌కు ఆమె స్పెషల్ ఏజెంట్‌గా పనిచేశారు.
2001లో ఎఫ్‌బీఐలో ప్రత్యేక ఏజెంట్‌గా చేరిన సిన్హా దాదాపు 24 ఏళ్లుగా ఆ సంస్థలో పలు హోదాలలో పనిచేస్తున్నారు.తొలుత మిల్వాకీ ఫీల్డ్ ఆఫీస్‌లో నియమితులైన షోహిణి .అక్కడ ఉగ్రవాద నిరోధక దర్యాప్తులో పనిచేశారు.తర్వాత గ్వాంటనామో బే నావల్ బేస్, లండన్‌లోని ఎఫ్‌బీఐ లీగల్ అటాచ్ ఆఫీస్, బాగ్దాద్ ఆపరేషన్స్ సెంటర్‌లో తాత్కాలిక నియామకాలు కూడా పర్యవేక్షించారు.2009లో ఆమెకు సూపర్‌వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా పదోన్నతి లభించింది.వాషింగ్టన్ డీసీలోని కౌంటర్ టెర్రరిజం డివిజన్‌కు షోహిణి బదిలీ అయ్యారు.
కెనడాకు చెందిన ఎక్స్‌ట్రాటెరిటోరియల్ దర్యాప్తులకు ప్రోగ్రామ్ మేనేజర్‌గానూ సేవలందించారు.వాషింగ్టన్‌కు చెందిన కెనడియన్ లైజన్ అధికారులతోనూ కలిసి పనిచేశారు.

2012లో కెనడాలోని ఒట్టావాలో అసిస్టెంట్ లీగల్ అటాచ్‌గా సిన్హా పదోన్నతి పొందారు.రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌తో కలిసి ఉగ్రవాద నిరోధక విషయాలపై షోహిణి పనిచేస్తున్నారు.2015లో ఆమె డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్‌గా పదోన్నతి పొందిన షోహిణి.అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యవహారాలను పరిశోధించే స్క్వాడ్‌లకు నాయకత్వం వహించారు.

2020 ప్రారంభంలో సిన్హాను జాతీయ భద్రత , క్రిమినల్ సైబర్ చొరబాటు విషయాలపై పనిచేసే సైబర్ ఇంట్రూషన్ స్క్వాడ్‌కు బదిలీ చేశారు.2020లో పోర్ట్‌లాండ్ ఫీల్డ్ ఆఫీస్‌లో జాతీయ భద్రత, క్రిమినల్ అంశాలపై స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమెకు పదోన్నతి లభించింది.ఎఫ్‌బీఐలో చేరడానికి ముందు సిన్హా థెరపిస్ట్‌గా, తర్వాత ఎన్జీవో క్లినిక్ నిర్వాహకురాలిగానూ వ్యవహరించారు.ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ నుంచి మనస్తత్వ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.