సోషల్ మీడియాలో పాములకు( Snakes ) సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.కొన్ని వీడియోల్లో పాముల ప్రవర్తన ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని లోపల భయాన్ని పుట్టిస్తాయి.
పాములు ప్రత్యేకించి పొలాల్లో కనిపిస్తే రైతులు( Farmers ) గజగజ వణికిపోవడం సహజం.తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో( Andhra Pradesh ) ఓ భారీ గిరినాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఎప్పటిలానే తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
అయితే అకస్మాత్తుగా పొలాల్లోకి 15 అడుగుల భారీ గిరినాగు( King Kobra ) ప్రవేశించింది.దీనిని గమనించిన గ్రామస్తుల పెంపుడు కుక్కలు వెంటపడటంతో పాము ఆగి నిలుచుంది.
ఈ క్రమంలో పక్కనే ఉన్న చెట్ల వద్ద నిలబడి పరిశీలిస్తున్న రైతులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.ఆ భయానక దృశ్యాన్ని చూసిన రైతులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.దీంతో ఆ పాము చెట్ల మధ్యలోకి వెళ్లిపోయింది.అయినప్పటికీ, అది ఎక్కడికి వెళ్లిందో తెలియక రైతులు ఇంకా భయంతో వణికిపోయారు.గ్రామస్తులు ఈ భారీ గిరినాగును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఇది ఏ సమయంలోనైనా ప్రమాదకరంగా మారొచ్చని భావించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పామును పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు.ఇంత పెద్ద పాము మన దగ్గరే ఉంటుందని అసలు అనుకోలేదని కొందరు కామెంట్ చేస్తుండగా.
, ఇంతవరకు ఇలాంటివి కేవలం అభయ అరణ్యాలలో, టీవీలలో మాత్రమే చూశామంటూ ప్రజలు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.