పూర్వం రోజులలో అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న మగవారికి మాత్రమే బట్టతల( Bald Head ) వస్తూ ఉండేది.కానీ ప్రస్తుత రోజులలో 25 సంవత్సరాల యువకులకు కూడా బట్టతల వస్తోంది.
దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి.పురుషులలో బట్టతల ను ఆండ్రోజెనిటిక్ అలోపేసియా అని పిలుస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది మగవాళ్లలో ఎం ఆకారంలో నుదిటిన రెండు వైపులా ఉండే బట్టతలను చూస్తూ ఉంటాము.కానీ ఇది ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది.
మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది.దీనిని నామోషీగా ఫీల్ అయ్యేవారు కూడా ఉంటారు.
అలాగే మహిళలకు జుట్టు( Hair ) పల్చగా అవడమే ఉంటది కానీ మగవారి లాగా బట్టతల మాత్రం రాదు.పురుషుల బట్టతల కు గల ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందని దాదాపు చాలా మందికి తెలుసు.ఈ తీపి పదార్థాలు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.
ముఖ్యంగా తీపి పదార్థాలు( Sweets ) కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి.చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నెత్తి మీద మంటను కలిగిస్తాయి.
దీంతో తల మీద ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.ఇది జుట్టుకు నష్టాన్ని కలిగిస్తుంది.
అలాగే జుట్టు విపరీతంగా రాలిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే మహిళలలో, మగవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది.కానీ ఇది మీ జుట్టు రాలడానికి కారణం అవుతుంది.ఈస్ట్రోజన్( Estrogen ) లేదా టెస్టోస్టిరాన్( Testosterone ) హార్మోన్లు అసమతుల్యత వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కానీ థైరాయిడ్ సమస్య కూడా జుట్టు రాలడానికి దారి తీస్తుంది.ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు.కానీ ఈ పోషకాహార లోపం వల్ల మగవాళ్లలో బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇనుము లోపం వల్ల బట్టతల రావడంతో పాటు జుట్టు కూడా విపరీతంగా రాలుతుందని చెబుతున్నారు.