ఎలాంటి అలవాట్లు శరీరంలోని ఇమ్యూనిటీని తగ్గిస్తాయో తెలుసా..?!

గత సంవత్సర కాలం నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచం మొత్తం ఈ దెబ్బతో అతలాకుతలం అయిపోయింది.

 Habits, Reduce The Immunity,  Body, Tea, Coffe, Alchol,salt,sugar,tips For Good-TeluguStop.com

కొన్ని దేశాలలో ఇప్పటికీ కరోనా వైరస్ కాస్త ప్రభావం తగ్గినప్పటికీ మళ్లీ సెకండ్ వెవ్ అంటూ కరోనా వైరస్ తిరుగుముఖం పట్టింది.ఈ మహమ్మారిని నివారించడానికి ఇప్పటి వరకు పూర్తి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు దీని నుంచి బయటపడేందుకు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వైద్యుల సలహాలు తీసుకుంటూ అలాగే కొందరు వారి సన్నిహితుల వద్ద సరైన ఆహార నియమాలను తెలుసుకుని వారి శరీరానికి రోగనిరోధకశక్తిని ఏర్పరచుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా మానవుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గే అవకాశం ఉంది.

అవి ఏవో తెలుసుకొని అలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మీ శరీరం ఇమ్యూనిటీ పవర్ కోల్పోకుండా ఏదైనా వైరస్ లాంటివి సోకినప్పుడు మీరు దానిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు.మరి ఏలాంటి అలవాట్లు మీ శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయో ఓసారి చూద్దామా.

శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గించే వాటిలో ముఖ్యంగా కాఫీ టీ లలో ఉండే కెఫిన్ వల్ల రోగనిరోధక శక్తి కాస్త తగ్గుతుందని ఆర్యోగ నిపుణులు తెలియజేస్తున్నారు.చాలా మంది నిద్ర రాకుండా ఉండేందుకు టీ, కాఫీలు తాగుతూ ఉండడం పరిపాటిగా మారిందని అయితే అలా తరచుగా టీ, కాఫీలు తాగుతూ ఉండే వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అలాగే మన ఆహారపదార్థాలలో చక్కెర ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా మన శరీర రోగ నిరోధక శక్తి కణాలపై దాని ప్రభావం చూపుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

వీటితో పాటు అవసరం కంటే ఎక్కువ ఉప్పును మనం తినే ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందని ఇటీవల ఓ అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని దాని ద్వారా రోగ నిరోధక శక్తి కాస్త తగ్గుతుందని వారు వివరించారు.ఇక చివరిగా మద్యం సేవించడం ద్వారా కూడా కాలేయ సంబంధిత వ్యాధులు తెచ్చుకోవడమే కాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏమైనా చేస్తూ ఉంటే వాటి నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించండి.మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube