పవన్ కళ్యాణ్..
మెగా బ్రదర్స్ లో చిన్న వాడైనా కూడా ఇండస్ట్రీ లో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని స్టార్ హీరో గా ఎదిగారు.నిజానికి పవన్ కి ఫాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అయన చెప్పిందే వేదం.ఒక వైపు రాజకీయాల్లో బిజీ ఉంటూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ రెండు పడవల పై ప్రయాణం చేస్తున్నారు.
ఇక మా మూవీస్ అసోసియేషన్ లో కొన్నాళ్ల క్రితం శ్రీ రెడ్డి చేసిన రగడ మన అందరికి తెలిసిందే.ఆమె రామ్ గోపాల్ వర్మ మాటలు విని పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడం తో ఇండస్ట్రీ మొత్తం వేడెక్కింది.

తన తల్లిని అన్న తర్వాత పట్టరాని కోపం తో అసోసియేషన్ బిల్డింగ్ కి వచ్చి యుద్ధం చేసినంత పని చేసారు పవన్ కళ్యాణ్.అయన ఎంట్రీ విని ఇండస్ట్రీ మొత్తం హడలిపోయింది.ఒక్కొక్కరుగా అందరు మా అసోసియేషన్ కి చేరుకున్నారు.లోపల ఏం జరుగుతుందో తెలియక బయట మీడియా లేని పోనీ వార్తలను సైతం ప్రచారం చేసింది.ఆ సమయంలో మా అసోసియేషన్ కి శివాజీ రాజా ఛైర్మెన్ గా ఉండగా, నరేష్ జెనరల్ సేకరెట్రీ గా ఉన్నారు.పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని ముందే గమనించిన నరేష్ విషయం తన దాకా రాకముందే అక్కడ నుంచి తప్పించుకున్నారు.

ఇక ఆ వాడి వేడి మొత్తం శివాజీ రాజా మీదకు టర్న్ అయ్యింది.పవన్ కళ్యాణ్ వస్తూనే డజన్ల కొద్దీ లాయర్లని కూడా తెచ్చారు.శ్రీరెడ్డి ఇంత చేస్తున్న ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని పవన్ కళ్యాణ్ శివాజీ పైన ఫైర్ అయ్యారు.అయితే పవన్ కి తెలియని విషయం ఏంటి అంటే అప్పటికే శివాజీ తమ అసోసియేషన్ తరపున కోర్ట్ లో కేసు వేశారు.
ఆ విషయం తెలియని పవన్ కళ్యాణ్ శివాజీ పైన తన ఉగ్రరూపాన్ని చూపించారు.అంతే కాదు మరోసారి ఛైర్మెన్ పదవిలో ఎలా కూర్చుంటావో చూస్తాను అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారట.
అయితే ఆ తర్వాత విషయం వివరించి చెప్పగానే అయన కూడా అర్ధం చేసుకున్నారట.ఈ విషయాన్నీ ఈ మధ్య కాలంలో శివాజీ రాజా ఒక మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట పెట్టారు.
ఇక ఆ తర్వాత ఇష్యూ పరిణామం మొత్తం మారిపోయింది.ఆ దెబ్బతో శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది.