తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొదలైంది.ఫిబ్రవరిలోనే ఎండలు బాబోయ్ అనిపించాయి.
ఇప్పుడు మార్చి వచ్చింది.మరింతగా ఎండలు ముదరనున్నాయి.
ఇలాంటి సమయంలో బయట తిరిగేవారు, తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీల నిమిత్తం ఎండలో తిరగాల్సిన వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎండ దెబ్బ కొట్టినప్పుడు ఏం చేయాలి, అసలు ఎండ దెబ్బ కొట్టకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి.ఈ విషయాలను తెలుసుకున్న వారు ఎండకాలం కూడా ప్రమాదకర పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చు.
ఎండ వేడిని తట్టుకునేందుకు, ఎండదెబ్బ కొట్టిన వారికి తక్షణ ఉపశమనం కోసం బీహార్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మంచి శనగలు షర్బత్ వాడుతూ ఉంటారు.మంచి శనగల షర్బత్ అనేది శరీరంకు చాలా ఉపయోగదాయకం.
మంచి శనగల షర్బత్ అనేది అత్యంత ప్రయోజన దాయం అంటూ వైధ్యులు కూడా చెబుతున్నారు.
మంచి శనగల షర్బత్ తయారి:
మంచి శనగలు తిసుకుని, వాటి పొట్టు తొలగించి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి.అలా వేయించుకోవడం వల్ల మంచి శనగలు పచ్చి వాసన పోతాయి.చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
లీటరు నీటిని తీసుకుని 5 లేదా 6 టేబుల్ స్ఫూన్స్ శనగపిండిని కలుపుకోవాలి.తేనే, పంచదారా, బెల్లం వంటి వాటిని రుచి కోసం తగినంత వేసుకుని, ఫ్రిజ్ లో అయిదు నుండి పది నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత తాగితే రుచికి రుచి ఆరోగ్యంకు ఆరోగ్యం.
మంచి శనగల షర్బత్ ఉపయోగాలు:
ఇది శరీరంలో వెంటనే కలిసి పోయి శరీరాన్ని చల్లబర్చుతుంది.జీర్ణ శక్తిని పెంచడంతో పాటు, జీర్ణ సంబంధిత సమస్యలకు పరిష్కారం అవుతుంది.
ఇది పీచు పదార్థం అవ్వడం వల్ల పేగుల్లో ఉన్న మలినాలను తూడ్చి పెట్టేస్తుంది.ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్న తర్వాత ఈ షర్బత్ తాగితే ఆయిల్ ను తొలగిస్తుంది.చర్మం కూడా చాలా నిగారింపుకు వచ్చేలా చేస్తుంది. డయాబెటిస్, బిపీ ఉన్న వారు ఈ షర్బత్ ను కాస్త చెక్కర తక్కువ వేసుకుని తాగడం వల్ల మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు.
అందరికీ ఉపయోగదాయకమైన ఈ షర్బత్ గురించి స్నేహితులతో షేర్ చేసుకోండీ.