పుల్వామా లో సిఆర్పీఎఫ్ జావాన్లపై జైషే మహ్మద్ టెర్రరిస్ట్ లో ఉగ్రదాడి చేయి 44 మంది జవాన్ల మృతి కి కారణం అయిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ దాడి తామే చేసామని జైషే మహ్మద్ కూడా ప్రకటించుకుంది.
అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చిన భారత్ దాడి జైషే మహ్మద్ చేసినట్లు ఆధారాలు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని కబుర్లు చెప్పింది.తరువాత జైషే స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేయడం.
రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం జరిగింది.
ఇదిలా వుంటే పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కి పాకిస్తాన్ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పుల్వామా దాడితో జైషే మహ్మద్ కి ఎలాంటి సంబంధం లేదని, తాను వారితో మాట్లాడటం జరిగిందని పాకిస్తాన్ మంత్రి షా అహ్మద్ ఖురేషి వాఖ్యానించడం విశేషం.వారితో మాట్లాడి తాము చేయలేదు అని చెప్పగానే ఎలాంటి విచారణ చేయకుండా క్లీన్ చీట్ ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.