ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.దీని కారణంగా చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White hair ) సమస్యకు గురవుతున్నారు.
అయితే జుట్టు తెల్లబడిన తర్వాత ఇబ్బందులు పడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టోనర్ అద్భుతంగా సహాయపడుతుంది.
వారంలో కేవలం ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే తెల్ల జుట్టు భయమే అక్కర్లేదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు( Dry Rosemary ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ను వేసుకోవాలి.పది నుంచి పదిహేను లవంగాలు వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.అంతే మన హెయిర్ టోనర్ సిద్ధం అయినట్టే.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను వాడితే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.వయసు పైబడిన సరే కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.
పైగా ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు కురులు ఒత్తుగా సైతం పెరుగుతాయి.కాబట్టి తప్పకుండా ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.







