ముఖ్యంగా చెప్పాలంటే యూఎస్ వ్యవసాయ శాఖ నిపుణులు చేసిన ఒక అధ్యయనంలో మీరు 100 గ్రాముల ఎర్ర కూరగాయలను క్రమం తప్పకుండా తినడం మొదలుపెడితే శరీరంలో విటమిన్ల లోపం మరియు ప్రోటీన్, క్యాల్షియం సహా చాలా విటమిన్ల లోపం తొలగిపోతుందని చెబుతున్నారు.శరీరంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మరియు పోలేట్ లాంటి పోషకాలు మధుమేహం మరియు క్యాన్సర్( Cancer ) వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఎర్రటి కూరగాయలు బరువును నియంత్రించడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

ఎర్ర కూరగాయలను డైట్లో చేర్చుకోవడం వల్ల అధిక బరువు( overweight )ను త్వరగా దూరం చేసుకోవచ్చు.అలాగే రోజువారి ఆహారంలో ఎర్రని కూరగాయలను చేర్చుకోవడం అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే మీరు ప్రతి రోజు ఈ కూరగాయలను తినడం మొదలుపెడితే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లోపం దూరమైపోతుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఫలితంగా రోగనిరోధక శక్తి( Immunity ) మెరుగుపడుతుంది.
ఇంకా చెప్పాలంటే ఎర్రటి ఆకుకూరలలో ఉండే ఆమ్లాలు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఇ, పొటాషియం మరియు విటమిన్ సి శరీరాన్ని దెబ్బతీసే అనేక విషపూరిత మూలకాల సామర్ధ్యాన్ని దూరం చేసి తగ్గిస్తాయి.

అలాగే క్యాన్సర్ కణాలు పుట్టకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.ఫలితంగా సహజంగానే ఈ భయంకరమైన వ్యాధి దూరమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎర్రటి కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఈ కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలవిసర్జన సక్రమంగా జరిగేలా చేస్తుంది.ఫలితంగా అజీర్ణ ప్రమాదం దూరం అయిపోతుంది.
దీనితో పాటు గ్యాస్( Gas acidity ), హార్ట్ బర్న్( Heart burn ) వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.ఇంకా చెప్పాలంటే ఈ కూరగాయలను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.
దృష్టి లోపం ఉన్నవారు ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.ఎర్ర క్యాబేజీని గాయం పై పూస్తే విషం యొక్క ప్రభావాలు కూడా తగ్గిపోతాయి.
ఈ కూరగాయలను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు త్వరగా పెరుగుతాయి.