తేనె( Honey ) ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను వాడుతుంటారు.
తేనెలో వివిధ రకాల పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి తేనె అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అలాగే చర్మ రక్షణకు కూడా తేనె ఉపయోగపడుతుంది.పెదాల పగుళ్ల నుంచి మొటిమల నివారణ వరకు అనేక సమస్యలకు తేనెతో చెక్ పెట్టవచ్చు.
పెదాల పగుళ్ల తో( Chapped Lips ) బాధపడుతున్న వారు రాత్రుళ్లు పడుకునే ముందు ఒక టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.
ఉదయాన్నే వాటర్ తో కడిగేయాలి.ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గి పెదాలు మృదువుగా అందంగా మారతాయి.

అలాగే మొటిమల నివారణకు( Acne ) కూడా తేనె చాలా బాగా సహాయపడుతుంది.నైట్ నిద్రించే ముందు లేదా స్నానానికి గంట ముందు తేనె మొటిమలపై అప్లై చేసుకోవాలి.తేనెలో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలను సమర్థవంతంగా నివారిస్తాయి.

కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.అయితే అలాంటివారు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కి( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్ లా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే ముఖం పై ఒక్క మచ్చ కూడా లేకుండా పరారవుతుంది.
ఇక కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో బాధపడుతున్న వారికి కూడా తేనె ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.తేనె మరియు ఆలివ్ ఆయిల్ ను సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
నైట్ నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే నల్లటి వలయాలు దూరం అవుతాయి.