సాధారణంగా కొందరికి పొట్ట చుట్టూ కొవ్వు( Belly Fat ) భారీగా పేరుకుపోయి ఉంటుంది.చేతులు కాళ్లు సన్నగా ఉన్న పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ చాలా బాగా సహాయ పడతాయి.
రోజు నైట్ ఈ మ్యాజికల్ వాటర్ ను కనుక తాగితే పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అర అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు,( Fennel Seeds ) పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.అలాగే అల్లం తురుము కూడా వేసుకుని దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు పాటు మరిగించాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు నైట్ నిద్రించడానికి అరగంట ముందు ఈ వాటర్ ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.ప్రధానంగా ఈ వాటర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క్రమంగా కరిగించేస్తుంది.భారీ పొట్టను నాజూగ్గా మారుస్తుంది.అలాగే బరువు తగ్గడంలో సైతం తోడ్పడుతుంది.

ఇక రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టక ఎంతో మంది సతమతం అవుతున్నారు.అయితే ఈ వాటర్ ను తాగడం వల్ల నిద్రలేమి నుండి బయటపడతారు.ప్రశాంతమైన నిద్రను పొందుతారు.
అంతే కాకుండా ఈ వాటర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.