వర్షాకాలంలో ( rainy season )చాలా మంది ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు.కాబట్టి మనం మన జీవన శైలితో పాటు రోజు వారి ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి.
వర్షా కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.వీటిలో ముఖ్యమైనది మాంసం.
మతపరమైన దృక్కోణంలో చాలా మంది శ్రావణ మాసంలో( Sravanamasam ) శివుడిని ఆరాధించడానికి మాంసం తినరు.కానీ శాస్త్రీయ దృక్కోణంలో ఈ కాలంలో మాంసానికి దూరంగా ఉండటమే మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే రుతుపవనాలలో భారీ వర్షాలు గాలిలో తేమను పెంచుతాయి.

అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడం మొదలవుతుంది.వర్షాకాలంలో నేరుగా సూర్య రష్మీ లేకపోవడం మరియు తేమ కారణంగా ఆహార పదార్థాలు సాధారణంగా ఎక్కువగా కుళ్ళిపోతాయి.ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో వాతావరణం లో తేమ పెరగడం వల్ల మన జీర్ణశయం ప్రభావం తగ్గుతుంది.
మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.అలాగే జీర్ణ క్రియ బలహీనంగా( Weak digestion ) ఉంటే మాంసం ప్రేగులలో కుళ్ళిపోతుంది.
అదే ఆహారం మిమ్మల్ని విషపూరితం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో కీటకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

దీంతో చికెన్ గున్యా, డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.ఫలితంగా జంతువులు కూడా అనారోగ్యానికి గురవుతాయి.కాబట్టి ఈ జంతువుల మాంసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే చేపలు తినడం మన ఆరోగ్యానికి మంచిది.కానీ వర్షాకాలంలో దీనిని నివారించాలి.ఎందుకంటే భారీ వర్షాల కారణంగా మురికి మొత్తం నది ఒడ్డుకు చేరుకుంటుంది.
దీంతో చేపలు కూడా కలుషితమవుతున్నాయి.వాటిని తింటే అనారోగ్య సమస్యల బారిన పడడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.