దేవాలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుసా..?

మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతునికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.

 Importance Of Taking Prasadam At Temple,temple,temple Prasadam ,devotees,devotio-TeluguStop.com

స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.అలాగే కొంత మంది భక్తులు( Devotees ) స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని పంచి పెడుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రసాదం అంటేనే స్వచ్ఛతకు అర్థం.అలాగే భక్తితో రోజువారి పూజలు చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.


Telugu Bhakti, Devotees, Devotional, Temple, Temple Prasadam-Latest News - Telug

భగవంతునికి సమర్పించే నైవేద్యం( Prasadam ) ప్రసాదంగా మారుతుంది.దానిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని చెబుతున్నారు.కొంతమంది ప్రసాదం అంటే భగవంతుని కోసం ప్రత్యేకంగా చేసే ఆహారం అని భావిస్తారు.అసలు ప్రసాదం ఎందుకు పంచి పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.ఒకరు ఆహారాన్ని ఉడికించినప్పుడు అది సాధారణ ఆహారంగా ఉంటుంది.అదే భగవంతునికి సమర్పించినప్పుడు అది ప్రసాదంగా పవిత్రత పొందుతుంది.

ఇదే విధమైన సాధారణ గుణాలతో మానవుడు భగవంతుని వద్ద తనకు అప్పగించినప్పుడు అతని మనసు నిర్మలంగా మారుతుంది.

Telugu Bhakti, Devotees, Devotional, Temple, Temple Prasadam-Latest News - Telug

మానవుని జీవితం పవిత్రతను పొందాలంటే భక్తులు దేవాలయాలలో స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.అలాగే సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు తను ఇష్టపడే ఆహారం ప్రసాదంగా లభిస్తుందని ఎవరు అనుకోరు.దేవాలయంలో ఏమి ఇస్తారో దానినే ప్రసాదంగా భక్తితో( Bhakti ) అంగీకరించాలి.

అదే విధంగా జీవితంలో భగవంతుడు మనకు ఇచ్చిన ప్రతి దానిని కృతజ్ఞతతో, భక్తితో స్వీకరించి జీవించడమే జీవితం అని పండితులు చెబుతున్నారు.ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు.

భగవంతుని అనుగ్రహం( Gods Grace ) నాకు దొరికింది అని అనుకున్నప్పుడు జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది.శరీరం భగవంతుడు ఇచ్చిన బహుమతి దానికి తగిన గౌరవం ఇవ్వాలి.

దీన్ని తెలియజేయడం కోసం ప్రతి ఒక్కసారి తినడానికి ముందు భగవంతునికి కృతజ్ఞత తెలపడం అలవాటు చేసుకోవడం మంచిది అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube