ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.13
సూర్యాస్తమయం: సాయంత్రం.6.30
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.40 ల11.00
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
వృషభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.
మిథునం:

ఈరోజు ఆకస్మిక ధన లాభం.ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది.వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
సింహం:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.
కన్య:

ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.
తుల:

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.
వృశ్చికం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి.
ధనుస్సు:

ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు.ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు.ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి.
మకరం:

ఈరోజు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
కుంభం:

ఈరోజు బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం:

ఈరోజు సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.