కెనడాలో( Canada ) భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు.ఈ విషయాన్ని అక్కడి భారత రాయబార కార్యాలయం( Indian Embassy ) అధికారికంగా ప్రకటించింది.
ఒట్టావా నగరం( Ottawa ) సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలిపింది.ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.
మృతుడి కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.స్థానికంగా ఉన్న భారతీయ కమ్యూనిటీతోనూ సంప్రందింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
అయితే మృతుడి పేరు, హత్యకు దారి తీసిన కారణాలు, ఇతర వివరాలను ఇండియన్ ఎంబసీ వెల్లడించలేదు.ఈ ఘటన గురించి తెలుసుకున్న కెనడాలోని భారతీయ కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది.

గత కొద్దిరోజులుగా కెనడాలోని హిందూ ఆలయాలు, హిందూ ప్రజలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే .ఇక గతేడాది డిసెంబర్‌లో రోజుల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్ తన రూమ్ మెట్ చేతిలోనే హత్యకు గురయ్యాడు.ఆ తర్వాత డిసెంబర్ 6న సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న హర్షదీప్ సింగ్‌ను ఓ ముఠా దారుణంగా హతమార్చింది.
ఆ మరుసటి రోజే పంజాబ్‌కే చెందిన రితిక్ రాజ్‌పుత్‌పై చెట్టు కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.వరుస ఘటనలతో కెనడాలోని భారతీయ కమ్యూనిటీ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.

ఈ పరిణామాలను నిశితంగా గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.విద్వేషపూరిత నేరాలు, హింస కారణంగా కెనడాలో భద్రతా ప్రమాణాలు దిగజారిపోతున్నాయని విదేశాంగ శాఖ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది.కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని .ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో భారతీయ విద్యార్ధులు కెనడాలో చదువుకుంటున్నారని కేంద్రం పేర్కొంది.ఇండియన్ కమ్యూనిటీ( Indian Community ) కూడా అక్కడ చాలా పెద్ద సమూహమని విదేశాంగ శాఖ తెలిపింది.అధికారిక సమాచారం ప్రకారం.కెనడాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్ధులు చదువుతున్నారని అంచనా .