వర్షాకాలం( Rainy season ) వచ్చిందంటే చాలు రకరకాల రోగాలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.రోగాల గురించి పక్కన పెడితే వర్షాకాలంలో పాదాలు బాగా పాడవుతుంటాయి.
వర్షపు నీటిలో పాదాలు తడవడం లేదా నానడం వల్ల పగుళ్లు ఏర్పడుతుంటాయి.అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకి రింగ్వార్మ్, తామర, దురద సమస్యలు పాదాలను వేధిస్తాయి.
వీటికి దూరంగా ఉంటూ వర్షాకాలంలో పాదాలను పదిలంగా కాపాడుకోవాలి అంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షాకాలంలో బయట నుంచి వచ్చిన తర్వాత పాదాలను శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వీలైతే గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి.ఆ తర్వాత తడి లేకుండా టవల్ తో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి.
అలాగే నైట్ నిద్రించే ముందు పాదాలకు గోరువెచ్చని కొబ్బరినూనెను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేయాలి.కొబ్బరి నూనె( coconut oil )లో యాంటీమైక్రోబయల్, హైడ్రేటింగ్ మరియు హీలింగ్ గుణాలు ఉన్నాయి.
గోరువెచ్చని కొబ్బరి నూనెతో నిత్యం నైట్ పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.మృదువైన, తేమతో కూడిన పాదాలను పొందవచ్చు.పాదాలను బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.

వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు షూస్ ను అస్సలు ప్రిఫర్ చేయకూడదు.వర్షపు నీటిలో షూస్ తడిస్తే పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే షూస్ కన్నా చెప్పులు ధరించడం ఉత్తమం.
వర్షాకాలంలో బయట తిరిగి వచ్చాక ఒక్కోసారి పాదాలు దురదగా అనిపిస్తాయి.అలాంటి సమయంలో కొద్దిగా నిమ్మ రసం, వెనిగర్ మిక్స్ చేసి పాదాలకు అప్లై చేసుకోవాలి.
ఇలా చేస్తే దురద నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.ఇక వర్షాకాలంలో వారానికి కచ్చితంగా ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.
అందుకోసం ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసం, షాంపూ వేసి బాగా కలిపి అందులో కాసేపు పాదాలను నానబెట్టుకోవాలి.ఆపై స్క్రబ్బర్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి.
గోర్లను కూడా కత్తిరించి క్లీన్ చేసుకోవాలి.చివరగా వాటర్ తో శుభ్రంగా పాదాల్లో కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
పెడిక్యూర్ వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.