నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని ఇక ఆ నీటిలో ఓ కోతి పడితే అది బయటికి వచ్చేందుకు ఎంత కష్టపడుతోందో ఊహించుకోండి.నీటి ప్రవాహానికి ఎదురీదుతూ, అలసిపోయి నీరసపడిపోతుంది.
అంతేకాదు అది చనిపోయే ప్రమాదం కూడా ఉంది సరిగ్గా అప్పుడే ఒక పడవ వచ్చి లిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి అదృష్టమే ఈ కోతికి పట్టింది.మనుషులకే కాదు, మూగజీవాలకూ అదృష్టం కలిసి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం.
“నేచర్ ఇన్ అమేజింగ్”(“Nature in Amazing”) అనే X (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.44 లక్షల మందికి పైగా వీక్షించిన, 50 వేలకు పైగా లైకులు కొల్లగొట్టిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో అందరి మనసులను దోచుకుంటోంది.ఆ వీడియోలో, స్పైడర్ మంకీ (Spider Monkey)అని పిలిచే ఒక కోతి నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరడానికి నానా తంటాలు పడుతోంది.నీటిలో కొట్టుకుపోతుంటే, దయగల ఒక పడవ వ్యక్తి ఆ అలసిపోయిన జంతువును గమనించాడు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే తన మోటారు బోటును కోతి వైపు తిప్పాడు.క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్న స్విమ్మర్ వెంటనే పడవ ఎక్కేసింది.డెక్ మీద కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, మళ్లీ ఒడ్డుకు దూకేసింది.
ఈ మొత్తం సీన్‌కు బోటు వ్యక్తికి నవ్వాగలేదు.కోతి క్షేమంగా వెళ్లిపోతుంటే అతడి నవ్వులు మరింత ఎక్కువయ్యాయి.అతని దయార్ద్ర హృదయం, కోతి ప్రాణాలతో బయటపడటం.
ఈ వీడియోను సోషల్ మీడియాలో సూపర్ హిట్ చేశాయి.చాలా మంది యూజర్లు బోటు వ్యక్తి చూపిన దయను ప్రశంసలతో ముంచెత్తారు.
ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ, “నిజంగా ఇది చాలా గొప్ప మూమెంట్.మనసును హత్తుకునేలా ఉంది” అని అన్నారు.
మరొకరు రాస్తూ, “మీ దయకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.కానీ ఇది ఏ రకమైన కోతి? దీని తోక ఇంత పొడవుగా ఉంది?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ అందమైన వీడియో ఒక్కటే చెబుతోంది.మనుషుల పట్ల అయినా, జంతువుల పట్ల అయినా చిన్నపాటి దయ చూపినా అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది.సాధారణ క్షణాలను కూడా కరుణతో నింపితే అవి ఎంత ప్రత్యేకంగా మారుతాయో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది.