మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా మెగా కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) ఒకరు.
పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి తేజ్ అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ చురుగ్గా ఉన్నారు.

ఇక ప్రస్తుతం సాయితేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది ( Sampath Nandi ) దర్శకత్వంలో గాంజా శంకర్( Gaanja Shankar ) సినిమా చేయాలనుకున్నారు.సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ( Suryadevara Nagavamshi ) నిర్మాత అనుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో సాయి తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమాపై అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ వచ్చారు.

తాజాగా డైరెక్టర్ సంపత్ నంది ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.ఈ సినిమా షూట్ చేస్తున్న సమయంలోనే పోలీసుల నుంచి హీరో సాయి తేజ్ , నిర్మాత నాగ వంశీ, తనకు కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు.ఈ సినిమా టైటిల్ మార్చాలి అంటూ నోటీసులు జారీ చేశారు.నిజానికి ఒక కథ రాసిన తర్వాత ఆ కథ ఆధారంగా సినిమాకు టైటిల్ ఖరారు చేస్తాము అలాంటిది టైటిల్ మార్చమని చెబితే కథ మొత్తం మార్చాల్సి ఉంటుంది.
అందుకే ఈ సినిమాని పక్కన పెట్టేసాము అంటూ సంపత్ నంది చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.