1.ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై జగ్గారెడ్డి కామెంట్స్
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.వైఎస్ బొమ్మ పెట్టుకున్న ఆయన కొడుకు కూతురు మాత్రం ఆయన ఆశయం కోసం పనిచేయడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు.
2.చాకలి ఐలమ్మకు గవర్నర్ నివాళులు
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ వద్ద ఆమె విగ్రహానికి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ నివాళులర్పించారు.
3.నేడు బాసర ట్రిపుల్ ఐటీ లో మంత్రుల పర్యటన
నేడు బాసర ట్రిపుల్ ఐటీ లో మంత్రులు పర్యటించనున్నారు.ఐటి శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ట్రిపుల్ ఐటీ లో పర్యటించనున్నారు.
4.గిరిజన బంధు జీవనం విడుదల చేయాలి
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన బందు వెంటనే విడుదల చేయాలని గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజకుమార్ డిమాండ్ చేశారు.
5.గుజరాత్ లో మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంఐఎం ఖరారు చేసింది.ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఈ వివరాలను వెల్లడించారు.
6.శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు వైభవంగా అంకురార్పణ జరగనుంది.
7.రేవంత్ రెడ్డి పై షర్మిల కామెంట్స్
రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అని, దొంగ అని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.
8.సమగ్ర సర్వే విధానంపై ఏపీ జేఏసీ చైర్మన్ కామెంట్స్
సుదీర్ఘకాలం తర్వాత సమగ్ర భూ రీ సర్వే మొదలుపెట్టడానికి రెవెన్యూ ఉద్యోగులుగా స్వాగతిస్తున్నామని , కానీ భూ సర్వే సమయం సిబ్బందికి ఇవ్వడం లేదని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కామెంట్ చేశారు .
9.పి ఎఫ్ ఐ దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడి
పి ఎఫ్ ఐ ( పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ) పై ఈడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈడి అధికారులు గల్ఫ్ లోను వేల సంఖ్యలో ఈఎస్ఐ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు.
10.అనంత బాబు పేరు పిటిషన్ కొట్టివేత
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులు ప్రధాన నిందితుడుగా ఉన్న వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
11.పార్టీ పేరు ప్రకటించిన గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ మాజీ నాయకుడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబి ఆజాద్ జమ్ము కాశ్మీర్ లో తన కొత్త పార్టీ పేరును ” డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ ” గా ప్రకటించారు.
12.బిజెపి హరీష్ రావు కామెంట్స్
బిజెపిపై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.బిజెపి అంటే కాపీ పేస్ట్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
13.రజక బంధు ప్రకటించాలి
రజక బంధు ప్రకటించిన తరువాత టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై డిమాండ్ చేశారు.
14.రేపు తిరుమలలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ రేపు తిరుమల లో పర్యటించనున్నారు.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
15.ఇంద్రకీలాద్రి పై దేవి నవరాత్రులు
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నేటి నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
16.ప్రకాశం జిల్లాలో మంత్రుల బృందం పర్యటన
బృందం పర్యటన సాంగ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.డిప్యూటీ సీఎం మంత్రులు ఆదిమూలపు సురేష్ మెరుగు నాగార్జున ఆర్కే రోజా తదితరులు పాల్గొననున్నారు.
17. అన్నవరంలో నేడు డయల్ యువర్ ఈవో
నేడు అన్నవరం సత్యదేవుడి ఆలయంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు .
18.వివేకానంద హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
19.ఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,000 24 క్యారెట్ల 10:గ్రాముల బంగారం ధర – 50,200
.