అందరు దంపతుల జీవితంలో ఒక స్టేజి వస్తుంది.అప్పుడు పిల్లల ఇకపై వద్దు అని డిసైడ్ అవుతారు.
కాని ఇద్దరికి సెక్స్ కావాలి.మరి పిల్లలు పుట్టకూడదు అంటే? కండోమ్ వాడటం ఇద్దరిలో ఎవరికి పెద్దగా నచ్చకపోవచ్చు.గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే స్త్రీ శరీరానికి మంచిది కాదు.ఇలాంటప్పుడు మొదలయ్యే సమస్యే, ఇద్దరిలో ఎవరు ఆపరేషన్ చేయించుకోవాలి? చాలామంది భార్యభర్తలు ఈ విషయంలో గొడవ కూడా పడతారు.నిజానికి ఇదే చాలా పెద్ద ప్రశ్నే.కాని గర్భధారణలో ఇప్పటికే భరించలేని నొప్పులని అనుభవించంది భార్య.
కాబట్టి ఈసారి నొప్పులని భర్త అనుభవించడమే కరెక్టు.
అలా సరైన పద్ధతిలో అలోచించిన మగవారే వెసెక్టోమి ఆపరేషన్ కి వెళ్ళి, తండ్రి అయ్యే యోగ్యతని త్యాగం చేస్తారు.
ఈ ఆపరేషన్ తరువాత పురుషుల కొన్ని రకాల నొప్పులు అనుభవించాల్సి ఉంటుంది.అవి జీవితాంతం వెంటాడవచ్చు కూడా.
అందుకే ఆపరేషన్ అవసరం లేకుండా తండ్రి అయ్యే యోగ్యత ఇష్టమున్నప్పుడు కోల్పోవడానికి, మళ్ళీ ఇష్టమున్నప్పుడు తిరిగి పొందడానికి ఓ సరికొత్త టెక్నిక్ ని కనిపెట్టారు వాషింగ్‌టన్ డాక్టర్లు.
దీనిపేరే బిమిక్ ఎస్ఎల్వి (bimi ek slv).
ఇది ఒక వాల్వ్.దీని సైజు 7x11x18 మిల్లీమీటర్లు.
బరువు కేవలం రెండు గ్రాములు.దీన్ని ఓ చిన్న సర్జరీ ద్వారా స్పెర్మాటిక్ డక్ట్ లో అమరుస్తారు.
కేవలం అరగంటలోనే దీన్ని అమర్చడం పూర్తవుతుందట.కేవలం ఒక్కరోజు రెస్టు తీసుకుంటే సరిపోతుంది.
తెల్లారినుంచి మళ్ళీ ఎప్పటిలానే అన్ని పనులు చేసుకోవచ్చు.
ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ వాల్వ్ కి స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ బటన్లు ఉంటాయి.
డాక్టర్లు దీన్ని ఆఫ్ చేసి అమరుస్తారు.దాంతో వీర్యం బయటకి రాకుండా అడ్డుకోని, తిరిగి వృషణాల్లోకే వీర్యకణాల్ని పంపిస్తుంది.
అలా తండ్రి అయ్యే అవకాశం ఉండదు.ఒకవేళ తండ్రి అవ్వాలని మగవాడు కోరుకుంటే, వృషణాల్లోని స్క్రోటమ్ దగ్గర బయటినుంచే దీన్ని మళ్ళీ స్విచ్ ఆన్ చేయవచ్చు.
దాంతో వీర్యం ఎప్పటిలాగే బయటకి వస్తుంది.
మరి ఇది అమర్చడం వలన ఎలాంటి ఇంఫెక్షన్ ఉండదా? మళ్ళీ ఆన్ ఆఫ్ బటన్ అంటున్నారు అని మీరు కంగారుపడవచ్చు.అయితే ఈ వాల్వ్ పూర్తిగా పురుషుడి శరీర తత్త్వాన్ని దృష్టిలో పెట్టుకోని తయారుచేయబడినదని, దీనికి మెడికల్ టెస్టులలో పూర్తిగా పాస్ మార్కులు వచ్చాయని చెబుతున్నారు డాక్టర్లు.
