తలనొప్పి.సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పలు రకాల మందుల వాడకం, అతిగా నిద్ర పోవడం తదితర కారణాల వల్ల తలనొప్పి వేధిస్తూ ఉంటుంది.దాంతో తలనొప్పి నుంచి బయటపడడం కోసం చాలా మంది మెడికల్ షాప్ లో దొరికే పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.
అయితే ఆరోగ్యానికి హాని చేసే పెయిన్ కిల్లర్స్ ను వాడటం బదులు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే దెబ్బకు తలనొప్పి పరారవడం ఖాయం.మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెప్పర్ మెంట్ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్.తలనొప్పిని తరిమికొట్టడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ఈ ఆయిల్స్ లో ఏదో ఒకదానిని నుదురుపై అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా మసాజ్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే తలనొప్పి ఇట్టే దూరమవుతుంది.
అలాగే తలనొప్పి బాగా వేధిస్తున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఎనిమిది ఫ్రెష్ వేపాకులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ ముక్కలుపావు స్పూన్ వేసుకుని బాగా మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.
ఈ హెర్బల్ వాటర్ ను తాగితే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

యోగ తలనొప్పి నుంచి బయటపడడానికి ఓ అద్భుతమైన మెడిసిన్ లా పని చేస్తుంది.తలనొప్పి బాగా వేధిస్తున్నప్పుడు కనీసం పది నిమిషాలు పాటు యోగ చేశారంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక తలనొప్పి తో బాధపడుతున్నప్పుడు ఒకటి లేదా రెండు గ్లాసుల చల్లటి నీటిని తీసుకోవాలి.
ఇలా చేసినా తలనొప్పి దెబ్బకు తగ్గుద్ది.







