హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుని జన్మస్థానం పై గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అన్వేషణలో భాగంగా హనుమంతుని జన్మ స్థానాన్ని కనుగొన్నారు.హనుమంతుని జన్మ స్థానం తిరుమల సప్తగిరిలలో ఒకటైన అంజనాద్రేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో హనుమంతుని జన్మస్థానం అన్వేషణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కమిటీని నియమించింది.నాలుగు నెలల సుదీర్ఘ అన్వేషణ అనంతరం సరైన ఆధారాలతో కమిటీ సభ్యులు హనుమంతుడి జన్మ స్థానం తిరుపతి అని ప్రకటించారు.
హనుమంతుని జన్మ స్థలం పై నియమించిన కమిటీ పలు పురాణాలు,వాజ్మయ ,శాసన, భౌగోళిక చారిత్రక ప్రమాణాల ఆధారంగా తిరుమల కొండల్లోని అంజనాద్రి నని సరైన ఆధారాలతో వెల్లడించారు.తాము సేకరించిన ఆధారాల ప్రకారం అంజనాద్రి పై ఉన్న జపాలి తీర్థమే హనుమంతుని జన్మ స్థానం అని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ వెల్లడించారు.
త్రేతాయుగంలో అంజనాద్రికి 20 పేర్లు ఉండేవని, అంజనాద్రికే వెంకటాద్రి అనే పేరు కూడా కలదని ఈ సందర్భంగా వీసీ వెల్లడించారు.

హనుమంతుడి తల్లి అంజనాదేవి తిరుమలగిరిలో సంతానం కోసం తపస్సు చేస్తుండగా అంజనాదేవికి తపస్సు కారణంగా ఈ పర్వతంపై ఆంజనేయుడు జన్మించాడు.సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని తెలియజేస్తున్నాయి.హంపి, విజయనగరం, గుజరాత్, మహారాష్ట్ర, ఇవేవీ హనుమంతుని జన్మ స్థానం కాదని, హనుమంతుని జన్మ స్థానం తిరుపతి అని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వెల్లడించారు.అయితే ఈ విషయాన్ని శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేయాలనే కమిటీ సభ్యులు హనుమంతుని జన్మ స్థానాన్ని శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేశారు.