ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాలలోని వ్యక్తులు శివుని వాహనం నంది( Nandi ) చెవిలో చెప్పడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, అలాగే ఎన్నో రకాల కష్టాలు దూరం అవుతాయని నమ్ముతారు.అయితే ఈ ఆచారం వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శివయ్య తపస్సులో ఉంటాడు.ఆయన తపస్సుకు ఎప్పుడు ఎలాంటి భంగం కలగకూడదు.
అందుకే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియజేస్తామని పండితులు చెబుతున్నారు.నంది శివునికి ఎదురుగా ఉంటాడు.
కాబట్టి ఆయన వద్ద మన కోరికలు తెలియజేస్తే ఆయన శివుని దృష్టికి తీసుకెళ్తాడని చెబుతున్నారు.

ఏ భక్తులు తమ సమస్యలతో శివుని( Lord Shiva ) వద్దకు వచ్చిన నంది అక్కడ వారి కోరికలను విని శివునికి తెలియజేస్తాడు.ఇంకా చెప్పాలంటే శివ భక్తులు అభిప్రాయం ప్రకారం నంది మాత్రమే ఎవరిపైన విపక్ష చూపడని కూడా నమ్ముతారు.64 కళలలో దిట్ట అయినప్పటికీ వినయంగా ఉండే నందీశ్వరుడు( Nandeeswarudu ) తన స్పష్టమైన పదాలతో శివునికి సందేశం అందిస్తాడు.అందుకే అతన్ని శివుని దూతగా కూడా పిలుస్తారు.నంది శివునికి ప్రధాన గణం అందుకే శివుడు కూడా అతని మాట వింటాడు.
ఇంకా చెప్పాలంటే ఒకసారి శివుడు తల్లి పార్వతి( Goddess Parvati )తో ధ్యానం చేస్తున్నప్పుడు నంది కూడా ఆమెతో ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడు.ఆ సమయంలో అతను శివుని ముందు కూర్చుని తపస్సు చేస్తాడు.
అందుకే నంది విగ్రహం ఎప్పుడూ శివుని ముందు ఉంటుంది.ఒకప్పుడు జలంధరుడనే రాక్షసుడి( Jalandarudu ) నుంచి తమను తము రక్షించుకోవడానికి భక్తులందరూ శివుని వద్దకు వెళ్తారు.
అప్పుడు శివుడు తపస్సులో మునిగిపోయాడు.గణపతి కూడా శివునికి సందేశాన్ని తెలియజేయలేక పోతాడు.

ఆ సమయంలో గణపతి( Lord Ganapati ) కూడా నంది ద్వారా శివునికి సందేశాన్ని అందించాడు.నంది ద్వారా శివునికి మన కోరికలు ఏవైనా చెప్పినట్లయితే అది నెరవేరుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.మరోవైపు శివుడితో పాటు నందిని పూజించకపోతే శివుని పూజ అసంపూర్తిగా మిగిలిపోతుంది.