పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమాని సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తున్నాడు.ఈ మల్టీ స్టారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇంకా ఈ సినిమా నుండి అప్డేట్ లు వచ్చిన దగ్గర నుండి భీమ్లా నాయక్ సందడి మొదలయ్యింది.ఈ సినిమా నుండి వస్తున్నా సాంగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం‘ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుని మరి ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్.భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే పవన్, రానా లుక్స్ రివీల్ చేసేసారు.ఇక ఇప్పుడు టీజర్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా టీజర్ వస్తే మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ టీజర్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

భీమ్లా నాయక్ టీజర్ ను డిసెంబర్ 14న కానీ 15న కానీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా వాయిదా వేస్తున్నారు అంటూ జరిగే ప్రచారాన్ని ఈ టీజర్ విడుదల చేసి పటాపంచలు చేయాలనీ మేకర్స్ చూస్తున్నారు.మరి భీమ్లా నాయక్ ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.