ముంబైలో ఫుడ్ స్ట్రీట్స్( Food Streets in Mumbai ) ఇప్పుడు రద్దీగానే ఉంటాయి.ఈ ప్రాంతాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.
అయితే ఇటీవల క్రిస్ రోడ్రిగ్జ్( Chris Rodriguez ) అనే అమెరికన్ టూరిస్ట్ కూడా ఒక ఫుడ్ స్ట్రీట్‌కి వెళ్లాడు.అతను ఒక పాపులర్ వ్లాగర్ కూడా.
అక్కడ బాబు అనే చెప్పులు పాలిష్ చేసే వ్యక్తిని కలిశాడు.బాబు చిరునవ్వుతో క్రిస్‌ను ఆహ్వానించి, అతని తెల్లటి బూట్లు శుభ్రం చేస్తానని చెప్పాడు.
ఇద్దరూ కలిసి నడుస్తుండగా, క్రిస్ స్నేహపూర్వకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“నీవు నిజంగా నా బూట్లు శుభ్రం చేయగలవా? నీ పేరేంటి? నా పేరు క్రిస్.నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది సోదరా,” అని అన్నాడు.బాబు ఎర్రటి సంచిని మోస్తున్నాడని క్రిస్ గమనించాడు.అందులో షూ పాలిష్ చేసే వస్తువులు ఉన్నాయా అని అడిగాడు.బాబు తలూపి తన కథ చెప్పాడు.
ఆరు నెలల క్రితం ఉద్యోగం కోసం జైపూర్ నుంచి వచ్చానని, కానీ వీధుల్లో ఉండటం వల్ల జీవితం కష్టంగా ఉందని చెప్పాడు.ఇప్పుడు రోజుకు రూ.30-40 సంపాదిస్తూ బూట్లు పాలిష్ చేసుకుంటూ జీవిస్తున్నానని తెలిపాడు.వీడియోలో బాబు క్రిస్ బూట్లను చాలా శ్రద్ధగా పాలిష్ చేయడం కనిపించింది.
తెల్లటి పాలిష్ ఉపయోగించి వాటిని కొత్త వాటిలా మెరిపించాడు.క్రిస్ చాలా ఆశ్చర్యపోయాడు.“థాంక్యూ సోదరా.చాలా బాగున్నాయి,” అని కృతజ్ఞతగా అన్నాడు.
క్రిస్ ధర ఎంత అని అడిగినప్పుడు, బాబు “రూ.10 సార్” అని చెప్పాడు. కానీ వెంటనే కొంచెం సంకోచిస్తూ ఒక విన్నపం చేశాడు.తన పని కోసం ఒక షూ బాక్స్ కావాలని, కానీ కొనడానికి డబ్బులు లేవని చెప్పాడు.“మీరు నాకు సహాయం చేయగలరా?” అని అడిగాడు.బాబు మాటలకు, అతని కష్టానికి చలించిపోయిన క్రిస్, కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాడు.అతను బాబుకు రూ.2,000 ఇచ్చి, షూ బాక్స్ కొంటానని మాట ఇవ్వమని అడిగాడు.మరుసటి రోజు వచ్చి చూస్తానని కూడా చెప్పాడు.
కానీ క్రిస్ మరుసటి రోజు తిరిగి వచ్చినప్పుడు నిరాశ చెందాడు.బాబు అక్కడ ఉన్నాడు, కానీ షూ బాక్స్ మాత్రం లేదు.బదులుగా ఏదో ఒక సాకు చెప్పాడు.
పక్కనే కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి, బాబు ఇలాగే అందరినీ మోసం చేస్తాడని క్రిస్‌తో చెప్పాడు”మరుసటి రోజు చూశాను.ఏదో సాకులు చెప్పాడు.
కొబ్బరికాయలమ్మే అతను చెప్పాడు.అతడు అందరినీ ఇలాగే మోసం చేస్తాడని.ఇదే అతని పని అని.,” అంటూ క్రిస్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రాసుకొచ్చాడు.