శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన ‘శ్రీ వేంకటాచల మాహాత్మ్యం’ అన్న గ్రంథంలోని తృతీయా శ్వాసంలో 177వ పుటలో శ్రీ వేంకటేశాష్టాక్షరీ మంత్ర జపం ప్రస్తావింపబడింది. ‘శ్రీవేంకటేశాయ నమః’ అనేది అష్టాక్షరీ మంత్రం.దీన్ని ఓంకార పూర్వకంగా జపించ వచ్చు.అంగన్యాస కరన్యా సాదులతో జపంచేసి ధ్యానం, ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం ఇత్యాది షోడశోపచారాలు కావించాలి.108 సార్లు ‘శ్రీ వేంకటేశాయ నమః’ అని ఉచ్చరించి పాదాలు మొదలు శిరః పర్యంతం సర్వాంగాలనూ అర్చించాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.

 How To Do Sri Venkateshwara Japam Details, Venkateshwara Japam, Venkateswara Swa-TeluguStop.com

లక్షల జపము చేస్తే పునశ్చరణ అవుతుంది.కర్పూర నీరాజనం కావించి మంత్ర పుష్ప ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి.

ధ్యానం చేయాలి.అలా చేస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది.

శ్రద్ధా భక్తులతో, గురు విశ్వాసంతో గురు ముఖంగా మంత్రం గ్రహించి జపిస్తే కృతార్థత సిద్ధిస్తుంది.కేవల నామ జపం కూడా తగిన ఫలం కల్గిస్తుంది.

అయితే శ్రీ వేంకటేశ్వర జపం చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ జపం చేయడం వల్ల స్వామి వారి కృపకు పాత్రులం అవ్వొచ్చు.మనం కోరిన కోరికను ఆ స్వామి వారు కచ్చితంగా నెరవేరుస్తారు.అందుకే చాలా మంది ఆ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వెంకటేశ్వర జపాన్ని పఠిస్తుంటారు.

అలాగే మనశ్శాంతి కోసం కూడా ఈ జపాన్ని చదువుకోవచ్చు.ప్రతిరోజూ స్నానం చేశాక కాసేపు దేవుడి ముందు కూర్చొని ఈ జపాన్ని చదవండి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube