నాగ పంచమి రోజు ఇలా చేస్తే దోషాలన్నీ దూరం అవ్వడం ఖాయం..!

సనాతన భారతీయ సంస్కృతిలో నాగ పూజకు ఎంత ప్రాముఖ్యత ఉంది.శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

 If You Do This On The Day Of Naga Panchami All The Errors Are Sure To Go Away..,-TeluguStop.com

నాగపంచమి( Naga Panchami ) ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమశివుడే స్కంద పురాణంలో వెల్లడించాడు.ముఖ్యంగా చెప్పాలంటే అది శేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైన వరం కోరుకోమని అడిగితే, అప్పుడు ఆదిశేషుడు తమ ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు.

ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శుక్లపక్షం రోజున ప్రజలు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.

అయితే ఈ సంవత్సరం నాగ పంచమినీ ఆగస్టు 21వ తేదీన భక్తులు జరుపుకొనున్నారు.ఈ నాగ పంచమి రోజున భక్తులు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

నాగపంచమి రోజున నాగులనీ పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు అంతే కాకుండా భక్తులు( devotees ) పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు.

అంతే కాకుండా నాగ పంచమి రోజున విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయడం ఎంతో మంచిది.అలా చేయడం వలన పూజ చేసిన వారికి విష బాధలు ఉండవని పండితులు చెబుతున్నారు.అలాగే ప్రతి రోజు నాగపంచమి రోజున సర్ప స్తోత్రాన్ని చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు.

అలాగే వంశాభివృద్ధి, సంతాన ఉత్పత్తి, కార్యసిద్ధి, కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ( Naga Dosham )తొలగిపోతాయి.ఇంకా చెప్పాలంటే సంతానం లేక బాధపడుతున్న వారికి ఆ సమస్య తీరిపోతుంది.

వారి కోరికలు అన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube