ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం.5.52
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: మ.1.13 ల3.44
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు.దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి.వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
వృషభం:
ఈరోజు కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.
మిథునం:
ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు.కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం:
ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయట పడగలరు.విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
సింహం:
ఈరోజు శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
దైవ చింతన పెరుగుతుంది.నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.
కన్య:
ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.నూతన ఋణ యత్నాలు కలసిరావు.
తుల:
ఈరోజు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు.అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.
క్రయవిక్రయాలలో లాభలు అందుకుంటారు.వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.
ధనుస్సు:
ఈరోజు గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.మిత్రులకు ధన సహాయం అందిస్తారు.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.
మకరం:
ఈరోజు మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి.వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు.ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం:
ఈరోజు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు.
మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు.వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మీనం:
ఈరోజు సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.