అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump ,US President) బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఖర్చులు తగ్గించడం , పాలనలో పారదర్శకతే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగా ఫెడరల్ ల్యాండ్స్, సైనికుల సంక్షేమం వంటి విధులు నిర్వర్తించే దాదాపు 9,500 మందికి పైగా కార్మికులను శుక్రవారం తొలగించారు.
ఉద్యోగుల తొలగింపు డ్రైవ్ (Employee layoff drive) ఇప్పటి వరకు అంతర్గత, ఇంధన, వెటరన్ ఎఫైర్స్, వ్యవసాయం, ఆరోగ్యం, మానవ సేవల విభాగాలలోని కార్మికులను లక్ష్యంగా చేసుకుంది.
వీరిలో చాలా మంది మొదటి ఏడాది ప్రొబేషనరీ సిబ్బందిగా, తక్కుగా ఉపాధి రక్షణలు కలిగి ఉన్నారు.కొన్ని ఏజెన్సీలు ఇప్పటికే మూసివేయబడ్డాయి.వాటిలో ఒకటి స్వతంత్ర వాచ్‌డాగ్‌గా పనిచేసే కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో.
ఇంతలో పన్ను వసూలు చేసే సంస్థ.
ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)(Internal Revenue Service (IRS)) కూడా వచ్చే వారం వేలాది మంది కార్మికులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోందని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.అమెరికా ప్రజలు ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి గడువు (ఏప్రిల్ 15)కు ముందే ఇది వనరులను పిండేసే చర్యగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఫెడరల్ ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయిందని వృథా, మోసం కారణంగా చాలా డబ్బు పోయిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.గతేడాది 1.8 ట్రిలియన్ల లోటుతో పాటు దాదాపు 36 ట్రిలియన్ల అప్పు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు ట్రంప్ చర్యలకు మద్ధతు ఇచ్చినప్పటికీ.
ప్రభుత్వ వ్యయంపై శాసనసభ రాజ్యాంగ అధికారాన్ని ట్రంప్ తగ్గిస్తున్నారని కాంగ్రెస్ డెమొక్రాట్లు మండిపడుతున్నారు.

మరోవైపు.మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనడాన్ని నిషేదించిన డొనాల్డ్ ట్రంప్.తాజాగా ఆ దేశ మిలటరీ విభాగంలోనూ ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని నిషేధించారు.
ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలటరీ అధికారికంగా ప్రకటించింది.