1.నేడు రేపు హైదరాబాద్ లో ఎంఎంటిఎస్ లు రద్దు
నేడు , రేపు హైదరాబాద్ లో 34 ఎం ఎం టి ఎస్ ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
2.బిజెపి సన్నాహక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేడు తెలంగాణ బిజెపి సన్నాహక సమావేశం నిర్వహించనుంది.
3.రెండో రోజు ఢిల్లీలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు.
4.విశాఖలో సబ్సిడీపై టమోటాల అమ్మకాలు
నేటి నుంచి విశాఖపట్నం రైతుబజార్లలో సబ్సిడీపై టమాటా అమ్మకాలు నిర్వహించనున్నారు .కేజీ టమాటా 60 చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.
5.కాంగ్రెస్ రైతు రచ్చబండ
నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు.
6.నారా లోకేష్ కామెంట్స్
ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.
7.హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
రాబోయే కొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
8.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి దర్శనానికి 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోట టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం విడుదల చేసింది.
9.దావోస్ కు చేరుకున్న జగన్
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు.స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు.
10.నేడు జగిత్యాల జిల్లాలో కవిత పర్యటన
నేడు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు.
11.రేవంత్ రెడ్డి పర్యటన
నేడు హన్మకొండ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
12.ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
తెలంగాణలో రాగల ఐదు రోజులలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
13.హెల్త్ కేర్ కౌన్సిల్ ఏర్పాటు
తెలంగాణ వైద్య ,ఆరోగ్య అనుబంధ వృత్తుల పరిపాలన సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
14.టిపిసిసి చింతన్ శిబిర్
ఏఐసిసి సూచనల మేరకు జూన్ 1, 2 తేదీల్లో రాష్ట్రస్థాయి చింతన్ శిబిర్ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనుంది.
15.పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టిసి ప్రకటించింది.
16.ఆహార భద్రతా చట్టం అమలుపై సమీక్షకు విజిలెన్స్ కమిటీ
జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరుపై సమీక్షించేందుకు రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
17.ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు.
18.అగ్నిమాపక శాఖలో 225 ఖాళీల నోటిఫికేషన్ జారీ
తెలంగాణ అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
19.తెలంగాణలోనూ పోటీ చేస్తాం : పవన్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ను జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు.
20.పోలవరంలో సెల్ వే గేట్లు బిగింపు
పోలవరం ప్రాజెక్ట్ లో స్పిల్ వే గేట్ల బిగింపు పూర్తయింది.
.