దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

దంతాలు( teeth ) ఆరోగ్యంగా ఉండాలని, తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.కానీ దంతాల విషయంలో చాలా మంది అశ్రద్ధగా వ్యవహరిస్తుంటారు.

 These Are The Precautions That Must Be Taken For Healthy Teeth! Healthy Teeth, S-TeluguStop.com

ఫలితంగా అనేక దంత సమస్యలను ఎదుర్కొంటారు.ఈ నేపథ్యంలోనే దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి.

మీ దంతాల మధ్య నుండి ఫలకం మరియు ఆహారాన్ని తొలగించడానికి రోజుకు ఒకసారి ఫ్లాస్ చేసుకోవాలి.కఠినమైన టూత్ బ్రష్ లను ఉపయోగించరాదు.

ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్‌ ను మార్చాలి.అలాగే ధూమపానం మీ చిగుళ్ల వ్యాధి, దంతాల నష్టం మరియు నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అందువల్ల ధూమపానం అలవాటు ఉంటే మానుకోండి.

టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం దంతాలకు హానికరం.

చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌ కూడా దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.వాటికి బదులుగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోండి.

క్యారెట్, స్ట్రాబెర్రీ, పాలు, పెరుగు, నట్స్, పాలకూర, చేపలు( Carrots, strawberries, milk, yogurt, nuts, lettuce, fish ) వంటి ఆహారాలు దంతాలను దృఢంగా మారుస్తాయి.

అలాగే ఆరోగ్యమైన తెల్లటి మెరిసే దంతాల కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనెలో పావు టీ స్పూన్ ఉప్పు కలిపి దంతాలను రెండు నిమిషాల పాటు తోముకోండి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి.ఈ విధంగా చేస్తే దంతాలు ముత్యాల్లా మారతాయి.

Telugu Tips, Latest, Teeth, Healthyteeth-Telugu Health

దంతాల పసుపుదనం పోవాలంటే రెండు టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ కు రెండు టేబుల్ స్పూన్లు వాటర్ మిక్స్ చేయాలి.ఈ ద్రావణం తో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నోటిని పుక్కిలించాలి.ఆపై నోటిని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే దంతాలపై పసుపు మరకలు పోతాయి.

Telugu Tips, Latest, Teeth, Healthyteeth-Telugu Health

కొబ్బరి నూనె అనేది మీ దంతాలను ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడే సహజమైన డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ గా ప‌నిచేస్తుంది.కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ కు బదులుగా కొబ్బరి నూనెతో అయినా నోటిని పుక్కిలించొచ్చు.ఆయిల్ పుల్లింగ్ నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను అంతం చేస్తుంది.దంత క్షయం మరియు కావిటీలను నిరోధిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube