స్ట్రెచ్ మార్క్స్.( Stretch Marks ) డెలివరీ అనంతరం మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
ప్రధానంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అనేవి హెవీగా ఏర్పడుతుంటాయి.ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
ఈ మార్క్స్ ను వదిలించుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు.కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ సరైన కేర్ తీసుకుంటే ఇంట్లోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ క్రీమ్ స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్( Vaseline ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె,( Mustard Oil ) హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
దాదాపు ఐదు నిమిషాలు కలిపాలంటే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ క్రీమ్ ను స్నానం చేసిన అనంతరం స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసుకుని సున్నితంగా కాసేపు మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను ఉపయోగించారంటే చాలా కొద్ది రోజుల్లోనే మీరు అదిరిపోయే రిజల్ట్ ను గమనిస్తారు.

ఈ క్రీమ్ స్ట్రెచ్ మార్క్స్ ను క్రమంగా మాయం చేస్తుంది.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.స్కిన్ ను మళ్లీ మునిపటిలా అందంగా మృదువుగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.