అధిక బరువు( Obesity ) సమస్యతో బాధపడే వారే కాదు తక్కువ బరువు సమస్యతో బాధపడే వారు కూడా ఎందరో ఉన్నారు.బరువు తగ్గడమే కష్టం అని చాలామంది అనుకుంటారు.
కానీ బరువు పెరగడం కూడా కష్టమే.ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉన్నవారు బరువు పెరగడానికి( Weight Gain ) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయినా కూడా కొందరు బరువు పెరిగరు.దీంతో మందులు కూడా వాడుతుంటారు.
కానీ సహజంగా మరియు హెల్తీ బరువు పెరగడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే చక్కగా బరువు పెరుగుతారు.
పుష్టిగా తయారవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం బరువు పెరగడానికి సహాయపడే ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
అరటి పండ్లు( Banana ) బరువును పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.అరటి పండును లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
బరువు పెరగాలని కోరుకునేవారు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే ఎనిమిది నుంచి పది బ్లూబెర్రీ పండ్లు,( Blue Berries ) వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, రెండు లేదా మూడు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న వాల్ నట్స్, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ బనానా బ్లూబెర్రీ స్మూతీ( Banana Blueberry Smoothie ) టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.బరువు పెరగాలని ఆరాటపడుతున్న వారు రెగ్యులర్గా ఈ స్మూతీని తీసుకుంటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు.ఈ స్మూతీ శరీరంలో క్యాలరీలను బాగా పెంచుతుంది.దాంతో బరువు పెరుగుతారు.పైగా ఈ స్మూతీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.
శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ ను అందిస్తుంది.రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.