1.తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు.
2.వైసీపీపై ఎంపీ రఘురామ విమర్శలు
టిడిపి నేత బీటెక్ రవి అరెస్టు ద్వారా పులివెందులలో భయానక వాతావరణం సృష్టించాలని పాలకులు భావించినట్లు స్పష్టమవుతుందని వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు.
3.మణుగూరులో రాహుల్ రోడ్డు షో

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం మణుగూరుకు రానున్నారు .ఈ సందర్భంగా రాహుల్ తో రోడ్ షో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
4.హరీష్ రావు విమర్శలు
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు అయినా చెబుతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
5.వైసిపి ప్రభుత్వం పై పురందరేశ్వరి విమర్శలు

ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్న, రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు.
6. కెసిఆర్ పై రాజేందర్ విమర్శలు
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.కేసీఆర్ మళ్ళీ గెలిస్తే దేవాలయ భూములను కూడా అమ్మేస్తాడని రాజేందర్ విమర్శించారు.
7.ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.గత కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతలు తన వెనుక గొయ్యి తవ్వుతున్నారని ఆరోపించిన ఆయన నేడు తన వ్యూహాలను సొంతమనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
8.తెలంగాణలో ఐటీ సోదాలు
తెలంగాణలో ఐటీ సోదాలు మళ్లీ మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.
9.బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసిపి

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.టిడిపి మండల కన్వీనర్ అశ్వర్థ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బాలకృష్ణ కారును మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నారు.
10.శబరిమలైకు ప్రత్యేక బస్సులు
తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఈనెల 16 నుంచి జనవరి 16వ తేదీ వరకు శబరిమల కు ప్రత్యేక బస్సులు నడుపునున్నట్లు ఆ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
11.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు విమర్శలు

కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని గజ్వేల్ లో బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీకి దిగడంతో ఆయనకు నిద్ర పట్టడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
12.దేవాలయాల్లో ఆదాయ వ్యయాల డిస్ ప్లే బోర్డులు
ఏపీలోని దేవాలయాల్లో ఆదాయ వ్యయాలకు సంబంధించిన డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు దేవదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు.
13.పవన్ పై బాలకృష్ణ కామెంట్స్

నాది పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం , దేనికి భయపడని వ్యక్తిత్వం అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
14.పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా సిద్ధమవుతున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
15.చంద్రబాబు బెయిల్ పిటిషన్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
16.గజ్వేల్ లో కేసీఆర్ పై 43 మంది పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తుండగా , ఆయనపై 43 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
17.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ లో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ వెలువడింది .వివిధ వైద్య సంస్థలో 487 పోస్టులను భర్తీ చేయనున్నారు.
18.బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ వాయుగుండం కొనసాగుతోంది .
19.కేదార్నాథ్ ఆలయం మూసివేత

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయం మూతపడింది.శీతాకాలం దృష్ట్యా కేదార్నాథ్ ఆలయ ముఖ ద్వారాన్ని మూసివేశారు.
20.కేటీఆర్ కామెంట్స్
మరోసారి తమకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలంగాణ ప్రజలను బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.