టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు రెగ్యులర్ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుకు హెల్త్ రిపోర్టును సమర్పించారని తెలిపారు.
అయితే దాన్ని తప్పుబట్టడం లేదన్న సజ్జల ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.ఈ మేరకు కోర్టు అనుమతిస్తే బెయిల్ రావచ్చని తెలిపారు.
చంద్రబాబు మరికొంత కాలం బయట ఉండేలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు హెల్త్ రిపోర్టును చూస్తుంటే వాళ్లు వైద్యులా లేక పొలిటికల్ డాక్టర్లా అనిపిస్తుందన్నారు.
మేనేజ్ చేసి హెల్త్ రిపోర్టును రాయించుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.చంద్రబాబు మేనేజ్ చేసి ఏమైనా చేయగలరనే దానికి ఇదే నిదర్శనమని తెలిపారు.