తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు…ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఆయన ఈ సినిమాతో కనక రెండు వేల కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టినట్టయితే ఇండస్ట్రీలో తను కూడా నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి ముందు వరుసలో నిలిచిన వాడవుతాడు.
లేకపోతే మాత్రం తన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అయితే ప్రశాంత్ నీల్( Prashanth Neil ) మాత్రం ఎన్టీఆర్ ( NTR )ను ఈ సినిమాతో 2000 కోట్ల క్లబ్ లో చేరుస్తానని మాట ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ప్రశాంత్ నీల్ దానికోసమే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారట.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.
కాబట్టి ప్రశాంత్ నీల్ భారీ రేంజ్ లో సినిమా లను చేస్తూ ముందుకు తీసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం.

మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక గత ఏడాది చేసిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు దాంతో ఆయన కొంతవరకు డీలాపడ్డారు.మరి ఇప్పటికైనా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి తర్వాత సినిమాలతో ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ పెరుగుతుంది అనేది…
.