తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోలు గా గుర్తింపు సాధించిన తర్వాత సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో తమ మార్కెట్ ను పెంచుకుంటూ హీరోలు ముందుకుపోతూ ఉంటారు అలాగే తమ మార్కెట్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ఆస్తిపరులు లైన స్టార్స్ చాలామంది ఉన్నారు.ఇండస్ట్రీలో ఉన్న హీరోల ఆస్తుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
నాగార్జున
అక్కినేని నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగార్జున శివ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సాధించారు ఆ తర్వాత చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ ఫోర్ లిస్టులో ఒకరిగా కొనసాగుతూ వచ్చారు అలాంటి నాగార్జున ఆస్తుల విలువ మూడు వేల కోట్ల వరకు ఉంటుంద.నాగార్జున బిజినెస్ లు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే సినిమాల్లో నటిస్తే వచ్చే డబ్బులు అన్నీ కలుపుకుని ప్రస్తుతం ఒక 3000 కోట్ల దాక డబ్బులు ఉన్నాయని చెప్పవచ్చు.
రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు.తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో తనలోని నటుడిని పూర్తిస్థాయిలో బయటకు తీశాడు.అపోలో గ్రూప్ ఆఫ్ చైర్మన్ మనవరాలు అయిన ఉపాసన ని పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ ఆస్తుల విలువ 3000 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా…
అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో అనతికాలంలోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 2500 కోట్ల దాకా ఉండొచ్చని చెప్తున్నారు…
మహేష్ బాబు
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఒక్కడు సినిమాతో మాస్ హీరో అయిపోయి పోకిరితో ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.అయితే మహేష్ బాబు చేస్తున్న బిజినెస్ ల ప్రకారం మరియు తను సినిమా సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ ప్రకారం అలాగే సినిమా కలెక్షన్ లో తీసుకుంటున్న పర్సంటేజ్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 2800 కోట్ల దాకా ఉండొచ్చని చెప్తున్నారు…
జూనియర్ ఎన్టీఆర్
నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాడు ఆది, సింహాద్రి వంటి సినిమాలు తనలోని మాస్ స్థాయిని జనానికి పరిచయం చేస్తే టెంపర్, నాన్నకు ప్రేమతోలాంటి సినిమాలు తనలోని నటుడిని జనానికి చూపించాయి ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ అయిన అలవోకగా చేయగల సత్తా ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఎన్టీఆర్ స్టూడియో ఎన్ అధినేత కూతురు అయిన లక్ష్మీప్రణతి ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఆస్తుల విలువ 3200 కోట్లుగా ఉన్నాయి.
మంచు విష్ణు
విష్ణు మోహన్ బాబు నట వారసుడిగా పరిచయం అయినప్పటికీ డీ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు.సినిమాలతో పాటు విష్ణు స్కూల్స్ , కాలేజీలు కూడా చూసుకుంటాడు.అలా వాటి పైన కూడా విష్ణుకి కోట్ల ఆదాయం వస్తుందని చెప్పొచ్చు అంతేకాకుండా వైయస్సార్ వాళ్ళ తమ్ముడు బిడ్డ అయిన విరోనిక నీ పెళ్లి చేసుకోవడం వల్ల కూడా విష్ణు ఆస్తులు పెరిగాయి.
ప్రస్తుతం విష్ణు ఆస్తులు 1900 కోట్లు గా ఉన్నాయి.