నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్( Viral ) అవుతూనే ఉంటాయి.కొన్ని సందర్భాలలో జంతువులు, పక్షులు మనుషులపై దాడికి దిగిన సంఘటనలు కూడా మనం చాలానే చూసాము.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కాకి( Crow ) ఒకటి కార్ పై వాలి కారు యజమానికి చుక్కలు చూపించింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఘటన ఏ ఊరిలో జరిగిందన్న విష్యం తెలియదు కానీ.ఒక ప్రదేశంలో కార్( Car ) పార్క్ చేశాడు సదరు కారు యజమాని.ఈ క్రమంలో ఒక కాకి వచ్చి కారుపై నుంచింది.
దీంతో యజమాని వచ్చి కాకే కదా హుష్ అంటే పోతుందని అనుకున్నాడు.కానీ, అది ఎంతసేపటికి కదలకుండా అక్కడే ఉండిపోయింది.
ఈ క్రమంలో యజమాని చేతితో పట్టి నెట్టివేయాలని ప్రయత్నం చేయగా.
కాకి మాత్రం అక్కడి నుంచి కదలకుండా అలానే ఉండిపోయింది.ఇక యజమాని కాకిని చేతిలో తీసుకొని ఒక పక్కకు తీసేద్దామని అనుకున్నాడు.కానీ, ఈ క్రమంలో కాకిని చేతిలోకి యజమాని తీసుకోగానే చుట్టుపక్కన ఉన్న మరికొన్ని కాకులు వేగంగా దూసుకుని రావడంతో పాటు ఆ కారు యజమానిని కాకి కాళ్లతో పొడవడానికి ప్రయత్నించాయి.
ఆ కారు యజమాని పై దాడి చేయడంతో పాటు చెట్టు కొమ్మలపై వెళ్లి వాలాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.